పాకిస్తాన్‌ GDP కంటే TATA మార్కెటే ఎక్కువ

ముంబై, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : సాల్ట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు వివిధ వ్యాపారాల్లో పాతుకుపోయిన టాటా గ్రూప్‌ అరుదైన ఘనత సాధించింది. టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ  పొరుగు దేశం పాకిస్థాన్‌ మొత్తం ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. టాటా గ్రూప్‌లోని అనేక కంపెనీలు గత ఏడాది కాలంగా మారథాన్‌ చేస్తుండడంతో మొత్తం గ్రూప్‌ విలువ భారీ సైజ్‌కు పెరిగింది.తాజా లెక్క ప్రకారం, భారతదేశంలో అతి పెద్ద వ్యాపార గ్రూప్‌ టాటా గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 365 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారతీయ రూపాయల్లోకి మారిస్తే, టాటా గ్రూప్‌ విలువ రూ. 30.3 లక్షల కోట్లు. పాకిస్థాన్‌ జీడీపీ విలువను 341 బిలియన్‌ డాలర్లుగా  అంచనా వేసింది. దీనిని కూడా రూపాయల్లోకి మారిస్తే సుమారు రూ.28.30 లక్షల కోట్లు అవుతుంది. ఈ లెక్కన, పాకిస్థాన్‌ మొత్తం స్థూల జాతీయోత్పత్తి  కంటే టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ. 2 లక్షల కోట్లు ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, టాటా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ ుఅూ మార్కెట్‌ విలువ, దాయాది దేశం జీడీపీలో సగం ఉంది. టాటా గ్రూప్‌లో, ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన కంపెనీలు 25. వీటి విలువే రూ.30.30 లక్షల కోట్లుగా ఉంది. టాటా సన్స్‌, టాటా క్యాపిటల్‌, టాటా ప్లే, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, ఎయిరిండియా ఇంకా లిస్ట్‌ కాలేదు. వీటి విలువలను కూడా లెక్కలోకి తీసుకుంటే, ఈ దిగ్గజ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ బాహుబలిలా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాటా గ్రూప్‌ కంపెనీలు ` మార్కెట్‌ విలువ

👉 టీసీఎస్‌ “ గత ఏడాది కాలంలో (గత 12 నెలల్లో) 16% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ.             14,93,981 కోట్లు.

👉 టైటన్‌ “ గత 12 నెలల్లో 45% లాభపడిరది. మార్కెట్‌ విలువ రూ. 3,24,628 కోట్లు.

👉 టాటా మోటార్స్‌ “ సవిూక్ష కాలంలో రెట్టింపు పైగా, 113% జంప్‌ చేసింది. మార్కెట్‌                   విలువ రూ. 3,11,970 కోట్లు.

👉 టాటా స్టీల్‌ “ ఏడాది క్రితం నుంచి ఇప్పటి వరకు 27% పైకి చేరింది. మార్కెట్‌ విలువ             రూ. 1,76,283 కోట్లు.

👉 ట్రెంట్‌ “ దాదాపు రెండు రెట్లు, 195% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ. 1,42,970 కోట్లు.

👉 టాటా పవర్‌ “  గత ఏడాది కాలంలో 83% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ. 1,20,193 కోట్లు.

👉 టాటా కన్జ్యూమర్‌ “ గత 12 నెలల్లో 57% లాభపడిరది. మార్కెట్‌ విలువ రూ. 1,09,304                 కోట్లు.

👉 ఇండియన్‌ హోటల్స్‌  “ సవిూక్ష కాలంలో 67% ర్యాలీ చేసింది. మార్కెట్‌ విలువ రూ.          76,495 కోట్లు.

👉 టాటా కమ్యూనికేషన్స్‌ “  ఏడాది క్రితం నుంచి ఇప్పటి వరకు 43% ఎగబాకింది.                     మార్కెట్‌ విలువ రూ. 50,201 కోట్లు.

👉 టాటా ఎల్‌క్సీ “ ఒక సంవత్సరంలో 12% లాభాలు అందించింది. మార్కెట్‌ విలువ రూ.        46,771 కోట్లు.

👉 టాటా టెక్నాలజీస్‌ గతేడాది నవంబర్‌ 30న లిస్ట్‌ అయింది. అప్పట్నుంచి ఇప్పటి                  వరకు 12% తగ్గింది. దీని మార్కెట్‌ విలువ రూ. 44,849 కోట్లు.

👉 ఓల్టాస్‌ “ ఈ షేర్లు గత 12 నెలల్లో 24% గెయిన్‌ అయ్యాయి. కంపెనీ మార్కెట్‌ విలువ               రూ. 35430 కోట్లు.

👉 టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ “ ఈ మల్టీబ్యాగర్‌ గత ఏడాది కాలంలో 153% పెరిగింది. మార్కెట్‌        విలువ రూ. 28,399 కోట్లు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏటికేడు మెరుగుపడుతుంటే, దీనికి రివర్స్‌లో, పాకిస్థాన్‌లో సంక్షోభం ఎప్పటికప్పుడు ముదురుతోంది. పరిపాలనలో సైనిక జోక్యం, రాజకీయ స్థిరత్వం లేకపోవడం పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం, 3.7 లక్షల కోట్ల డాలర్లు లేదా రూ.307 లక్షల కోట్లతో ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలచింది. 2027`28 నాటికి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 41వ స్థానంలో ఉంది, ఇది ఇంకా దిగజారే ప్రమాదం ఉంది.

`

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....