హైదరాబాద్,జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలోని పలు ప్రాంతాలలో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు ప్రకటించింది. కృష్ణ ఫేజ్ -1 మీరాలం,అలియాబాద్ వాటర్ ట్యాంక్ ల పరిధిలో మెయిన్ పైప్ లైన్ ల మరమ్మత్తుల కారణంగా రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు వాటర్ బోర్డు ప్రకటించింది. జనవరి 20, 21 వ తేదీలలో కుళాయిలు వచ్చే ప్రాంతానికి నీటి సరఫరా నిలిచి పోనున్నట్లు తెలియంది. పాతబస్తీ లోని అలియాబాద్, సుల్తాన్ షాహీ, గౌలిపురా మొఘల్ పుర, బహదూర్ పుర, జహ్నుమ, రియాసత్ నగర్, భవాని నగర్, శాలిబండ తదితర ప్రాంతాలలో నీటి సరఫరాకు రెండు రోజులు అంతరాయం కలుగనున్నట్లు ప్రజలు సహకరించాలని కోరారు.
- Homepage
- Charminar Zone
- పాతనగరంలో 2 days నీటి సరఫరా బంద్ !
పాతనగరంలో 2 days నీటి సరఫరా బంద్ !
Leave a Comment