పాతబస్తీలో మెట్రో పనులు వేగవంతం

హైదరాబాద్‌, జూలై 17, (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తీ మెట్రో రైలు పనులకు సంబందించిన కసరత్తులను మొదలు పెట్టినట్లు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నెలరోజుల్లో భూకేసరణకు నోటీసులు జారీ చేస్తామని వివరించారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌ నుమా వరకు రైలు నడిపేందుకు గతంలో ప్రతిపాదన వచ్చిందన్నారు. భూ సేకరణలో సమ్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ పనులను పూర్తి చేసేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పాతబస్తీలో మెట్రోరైల్‌ మార్గంలో 5 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని.. వాటిలో 4 నిర్మాణాల విషయంలో సమస్యలు తలెత్తాయని అన్నారు. త్వరలోనే వీటిని కూడా పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్‌ ప్రజలంతా ఎప్పుడెప్పుడూ అని వేచి చూస్తున్న పాతబస్తీ మెట్రో త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని మంత్రి కేటీఆర్‌ ఇటీవలే తెలిపారు.

 చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌ ` ఫలక్‌ నుమా మార్గాల మధ్య పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పినట్లు ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిరచారు. మెట్రో రైలు తొలి విడత కింద 69.2 కిలో విూటర్లు నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులు ఎత్తేసింది. రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలో విూటర్లు అదనంగా నిర్మిస్తే ఈ మార్గం పూర్తి అవుతుంది. అలాగే నిలిచిపోయిన ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌ నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం 74.7కిలో విూటర్లు పూర్తి అవుతుంది.హైదరాబాద్‌ మెట్రో రైలును పొడిగించాలన్నది పాతబస్తీ వాసుల చిరకాల డిమాండ్‌. ఆల్‌ ఇండియా మజ్లిస్‌`ఇ`ఇత్తెహాదుల్‌ ముస్లివిూన్‌ (ఎంఐఎం) చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ అనేక బహిరంగ ప్రసంగాలలో ఈ విషయాన్ని తెలిపారు. అయితే మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ చూసి ఆయన స్పందించారు. పాతబస్తీ ప్రజలు దీని కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారని చెబుతూ రీట్వీట్‌ చేశారు. 

ఇది కచ్చితంగా పాతబస్తీ ప్రజలకు సహాయం చేస్తుందని మరింత పర్యాటకాన్ని కూడా తీసుకు వస్తుందని వివరించారు. గత నెలలో రెండు వేర్వేరు ప్రసంగాల్లో పటాన్‌చెరు, కందకూరు వరకు మెట్రోను పొడిగిస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. 2023`24 రాష్ట్ర బడ్జెట్‌లో పాతబస్తీ వరకు మెట్రో రైలు సేవలను పొడిగించేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఆరు సంవత్సరాలుగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌ నుమా వరకు 5.5 కిలో విూటర్ల మార్గం నిలిచిపోయింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో మజ్లిస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే మార్గాన్ని మళ్లించేందుకు సర్వే నిర్వహించినా ముందడుగు పడలేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....