హైదరాబాద్, జూలై 26, (ఇయ్యాల తెలంగాణ ):పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌సీపీఎస్‌ఈయూ సాధన సంకల్ప రథయాత్ర చేపట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతోంది. తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 16 ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ప్రారంభించింది. ఈ నెల 31 వరకు పలు జిల్లాల్లో సాధన సంకల్ప రథయాత్ర కొనసాగుతోందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు. గద్వాల జిల్లా ఆలంపూర్‌లో మొదలైన ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, రెవెన్యూ కేంద్రం విూదుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. జులై 31న యాదాద్రి నరసింహస్వామి క్షేత్రంలో ఈ యాత్ర ముగుస్తుందని ఓ ప్రకటనలో వెల్లడిరచారు. పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. సీపీఎస్ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం చేపట్టిన ఈ యాత్రలో అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఆగస్టు 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తు?న్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి వచ్చే రాష్ట్ర ఉద్యోగులు జులై 16న ఓపీఎస్ సాధన సంకల్ప రథయాత్ర చేపట్టారు. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమైంది. మొత్తం 33 జిల్లాలను కవర్ చేసి ఆగస్టు 12న ర్యాలీతో హైదరాబాద్‌లో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ 33 జిల్లాలకు చెందిన జిల్లా సంఘాల నాయకులతో ఈ యాత్రపై చర్చించి, యాత్ర ప్రారంభించారు. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.ఆరు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాయని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ పరిధిలో ఉన్న 1,72,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుతో ఉద్యోగులకు లేదా వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక భద్రత లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగుల సీపీఎస్‌కు దాదాపు 20,000 కోట్లు స్టాక్ మార్కెట్‌లకు మళ్లించారన్నారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని సంకల్ప యాత్రను చేపట్టినట్లు టీఎస్సీపీఎస్‌ఈయూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు యండీ దిల్షాద్ తెలిపారు. పాత పెన్షన్ విధానమే లక్ష్యంగా సంకల్ప యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండ నుంచి రేగొండ మండలం విూదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు యాత్ర చేరుకుంటుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనే నినాదంతో హన్మకొండ నుంచి సంకల్ప యాత్ర కొనసాగనుందన్నారు.
- Homepage
- Telangana News
- పాత పెన్షన్ కోసం యాత్ర
పాత పెన్షన్ కోసం యాత్ర
Leave a Comment