పాత Vehicle’s కు చెక్‌…

హైదరాబాద్‌, మే 16, (ఇయ్యాల తెలంగాణ) :  జీవితాంతం కష్టపడి డబ్బులు కూడా పెట్టుకుని.. లక్షలు పెట్టి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వాహనాల్లో కొన్ని దొంగల పాలవుతున్నాయి. ఒకసారి ఏదైనా వాహనం దొంగిలించబడిరదంటే తిరిగి దక్కించుకోవడం కష్టతరంగా మారింది. చాలామంది చోరులు వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత వెంటనే నెంబర్‌ ప్లేట్లను మార్చేసి.. ముఖ్యమైన పార్కులను కూడా తీసేస్తున్నారు. అలా చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలో కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేయగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోవుంది. 2025 సెప్టెంబర్‌ నుంచి ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ ఉండాలని నిర్ణయించింది. అయితే ఈ నెంబర్‌ ప్లేట్ను ఇంటికే తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే కచ్చితంగా ఉంది. ఇందుకోసం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే?సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 కంటే ముందు వాహనాలు కొనుగోలు చేసుకున్న వారు  ను తప్పనిసరిగా ఉంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సెప్టెంబర్‌ 30 2025 గడువుగా నిర్ణయించింది. ఈ లోగా వాహనాలు ఉన్నవారు సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరిగా మార్చుకోవాలని పేర్కొంది. హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని, అలాగే రహదారి భద్రత ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అయితే సాధారణంగా హాయ్‌ సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ ను మార్చుకోవాలంటే రేడియం సెంటర్‌ లోకి వెళ్లి చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్చుకుంటే కనీసం రూ. 320 నుంచి రూ. 400 వరకు చార్జ్‌ అవుతుంది. అయితే కొందరు వీటిని నాణ్యమైనవిగా ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేరుగా రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచే ఐ సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లు ఇంటికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ద్వారా పై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ ఇంటికే వస్తుంది.

అదెలా చేయాలంటే?

ముందుగా గూగుల్‌ లోకి వెళ్లి లిలిలి.పనీనీసఎవ ష్ట్రబతీజూ.ఞనీఎ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్‌ ఓపెన్‌ చేయగానే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేయగానే దానికి సంబంధించిన పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో వాహనదారుల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కారు, ద్విచక్ర వాహనం, ఆటో, లారీ ఇలా ఏ వాహనమైన ఇందులో ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ కోసం బుకింగ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత డెలివరీ అడ్రస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన తర్వాత ఇంటి అడ్రస్‌ కు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ వస్తుంది.2019 సెప్టెంబర్‌ 30 తర్వాత ఈ నెంబర్‌ ప్లేట్‌ వాహనాలకు లేకపోతే పోలీసులు జరిమానా వేసి అవకాశముంది. ఈ జరిమానా భారీగా ఉండనుంది. అందువల్ల తెలంగాణలోని వాహనాలు ఉన్నవారు ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....