సనత్ నగర్, మే 22 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు స్వర్గీయ తాళ్ల రవీందర్ గౌడ్ ప్రథమ సంవత్సరీకం బల్కంపేట్ లోని రేణుక యెల్లమ్మ దేవాలయం సమీపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జి ఆకుల విజయ, అమీర్ పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, బీజేపే నాయకులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, చరణ్ సింగ్, నక్కా శ్రీనివాస్ గౌడ్, ఆకూరి శ్రీనివాస్ రావు, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, ప్రవీణ్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, సుధాకర్ ముదిరాజ్, లక్ష్మణ్, రమేష్, ఆకుల సత్యనారాయణ, గిరి యాదవ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, సందీప్ వర్మ, ఆకుల ప్రతాప్, బీరం నర్సింగ్ రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులలో తాళ్ల రవీందర్ గౌడ్ ఒకరని, ఆయన పదవీకాంక్ష లేకుండా నిస్వార్థంగా పార్టీ శ్రేయస్సు మరియు అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడేవారని గుర్తు చేసుకున్నారు. క్షేత్ర స్థాయి నుండి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడం ద్వారానే పార్టీ ప్రగతి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడేవారని అందుకు తగ్గట్టు ఆయన ప్రణాలికలు రచించేవారని అన్నారు. అంతటి కార్యదక్షత లేని నాయకుడు అర్థాంతరంగా తనువు చాలించడం ద్వారా తీవ్ర అగాథం ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చినట్లు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పొలిమేర సంతోష్ కుమార్ తెలిపారు.