పావులు కదుపుతున్న BJP, INC – సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం

న్యూఢిల్లీ /బెంగళూరు జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢల్లీిలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం. విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. విపక్ష భేటీలో కూటమికి కొత్త పేరు, సమన్వయకర్తల నియామకం, సీట్ల సర్దుబాటు కోసం కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది.

ఢిల్లీ ఆర్డినెన్స్‌, యూసీసీ, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం, నిరుద్యోగం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టే వ్యూహంపైనా విపక్ష నేతలు చర్చించనున్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ మద్దతిచ్చిన నేపథ్యంలో విపక్ష భేటీకి ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా హాజరవుతుండటం విశేషం. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ పార్టీ వైఖరి అంతుచిక్కడం లేదు.  బీజేపీతో జేడీఎస్‌ మైత్రి ఏర్పాటు చేసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఢల్లీి వెళుతున్నాతారనే చర్చ జోరందుకుంది. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్‌తో కలసి వెళ్లాలనే ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....