పోలీసుల తనిఖీలలో పట్టుబడ్డ రూ. 3.50 కోట్లు

హైదరాబాద్‌ అక్టోబర్‌ 21  (ఇయ్యాల తెలంగాణ );  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఎమ్మార్‌ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ మహేశ్‌ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు పట్టుబడ్డాయి. నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్‌ గ్రూప్‌ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్‌ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....