పోలీసుల తనిఖీల్లో నాటు తుపాకులు స్వాధీనం

నంద్యాల అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ ):ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్దన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.  ఐదు పార్టీలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీలలో  16 నాటు తుపాకులు,3 నాటు తుపాకులను ఉపయోగించే బ్యారెళ్ళు స్వాధీనంచేసుకున్నారు.  18 మందిని అరెస్ట్‌ చేసారు.మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.ఆళ్లగడ్డ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌  వెంకటరామయ్య, రూరల్‌ సీఐ హనుమంతనాయక్‌,  రూరల్‌  ఎస్సై టి.నరసింహులు,  సిబ్బంది పాల్గోన్నారు. అహోబిలం గ్రామంలో కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి గ్రామం చుట్టుముట్టి ఐదు పార్టీలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారుర. 18 మంది వ్యక్తులను ఆదుపులో తీసుకొని వారి నుండి 16 నాటు తుపాకులు, మూడు  నాటు తుపాకులను ఉపయోగించే బ్యారెళ్ళను మొత్తం 19 స్వాధీనం చేసుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....