ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్‌ లో చేరుతున్నారు MP కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (ఇయ్యల తెలంగాణ ); ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ లో చాలా మంది చేరుతున్నారని, తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక విషయం తనతో మాట్లాడలేదని.. అధిష్టానంతో మాట్లాడారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ తన సోదరుడే కాదని.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, కర్ణాటక లో హావిూ ఇచ్చిన పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. సెకండ్‌ లిస్ట్‌ ఈరోజు పూర్తవుతుందని, రేపు విడుదల అవుతుందని చెప్పారు. 6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని, అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు.సీఈసీ ఫైనల్‌ అయ్యేవరకు బయట మాట్లాడకూడదని, గతంలోనే కాళేశ్వరం పై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాసామని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదని, మిర్యాలగూడలో కూడా అడిగారని, అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుందనేది చూడాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులపై బుధవారం సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ పేరు చెప్పే అర్హత కేటీఆర్‌ కు లేదని, రాహుల్‌ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదని, ఇప్పుడు విూ ఆస్తులెంత కేటీఆర్‌ అంటూ ప్రశ్నించారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....