హైదరాబాద్, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజల గుండె చప్పుడు ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి అని తెలంగాణ స్టేట్ ఎస్సీ లెదర్ వర్కర్స్ ఫేడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఎల్బీ నగర్ హస్తినాపురం లోని జిఎస్ఆర్ కన్వేన్షన్ సెంటర్ లో ఎంఎల్ఏ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఆయన బృందం కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రగిరి సత్యనారాయణ మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి ప్రధాత,నియోజకవర్గ ఆరాధ్యుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సమగర మోచీ ఉపజాతి సీనియర్ నాయకుడు కానుకూర్తి వెంకటయ్య, రాష్ట్ర నాయకులు ఊత్కార్ బలరాం,మారుతి గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గుండె చప్పుడు ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి
Leave a Comment