అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు అని మరోసారి వలంటీర్ వ్యవస్థపై పవన్ షాకింగ్ కామెంట్స్ అమరావతి జూలై 12 ,(ఇయ్యాల తెలంగాణ ):
తనకు ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదని, ప్రభుత్వ విధానాల పైనే ద్వేషమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . ‘ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది. అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు. విషయాన్ని పక్కదోవ పట్టించవద్దు. వాలంటీర్లు వ్యవస్థ చిన్న తొండగా మొదలై ఊసరవెల్లిగా మారిపోయింది. ప్రజలను నియంత్రించి, భయపెట్టే స్థాయికి వెళ్లిపోయింది. ఏ మనిషికైనా డబ్బు కంటే ఎదుట వ్యక్తిని లొంగదీసుకోవడంలో ఆనందం ఉంటుంది. జగన్ దీనివిూదే ఆడుతున్నాడు. పులికి రక్తం మరిగించాడు. అది మనల్ని చంపే వరకు ఆగదు. వాలంటీర్లు తిప్పి కొడితే 6 లక్షల మంది ఉంటారు. ప్రజలు దాదాపు 6 కోట్ల మంది ఉంటారు. బ్రిటీష్ వాడు 5 వేల మందితో మొదట మనదేశాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. మన దేశపు ఏజెంట్లతోనే మనల్ని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు 6 కోట్ల మందిని కంట్రోల్ చేయడానికి జగన్ లక్షల మంది వాలంటీర్లను ఉపయోగిస్తున్నాడు. దీనిని ఎదుర్కోవడానికి ప్రజలు విజ్ఞానవంతులు కావాలి. ఏం నష్టపోతున్నామో అర్ధం చేసుకోవాలి. మనం చెబుతున్న కీలకమైన విషయాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజలకు అసలు విషయం అర్ధం కాకుండా చేయడానికి అధికారపార్టీ ఆధ్వర్యంలో నాటకం మొదలైంది. డిబేట్‌ను పక్కదారి పట్టించడానికి వైసీపీ నాయకులు నన్ను వ్యక్తిగతంగా తిట్టినా విూరు పట్టించుకోవద్దు. వాళ్ల ట్రాప్ లో అసలు పడొద్దు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలి. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడికి పోతుందో తెలియజెప్పే బాధ్యత మనపై ఉంది’ అని మరోసారి వలంటీర్ వ్యవస్థపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.