ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యం – Minister నారాయణ..


` విజయవాడలో పర్యటించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

` విజయవాడలో ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో పర్యటించి.. నీటి నాణ్యత పరిశీలన..

` వర్షాకాలంలో డయేరియా, సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు..

ప్రజారోగ్యంపై మున్సిపల్‌ శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తమైంది. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ గారు ఇవాళ విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ గారితో కలిసి పలు కాలనీల్లో  పర్యటించారు. మంచినీటి సరఫరా, నీటి నాణ్యతపై ప్రజలను నేరుగా కలుసుకొని ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ  సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశమున్నందున… ముఖ్యమంత్రి గారు సవిూక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అందులో భాగంగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పర్యటించినట్టు తెలిపారు. మంచినీటి సరఫరా నాణ్యతను పరిశీలించామని.. పలు ప్రాంతాల్లో సుమారు 600 శాంపిల్స్‌ సేకరించి పరీక్షించినట్టు తెలిపారు. 

నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. నిబంధనల ప్రకారమే మంచినీటి నాణ్యత ఉందన్నారు. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో సుమారు 12 లక్షల మందికి.. 187 ఎంఎల్‌ డి నీటి సరఫరా జరుగుతోందన్నారు. వర్షాకాలంలో డ్రైయిన్ల వద్ద మురుగునీరు పొంగి మంచినీటిలో కలిసే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే అధికారులకు సిల్ట్‌ డ్రైవ్‌ చేపట్టాలని సూచించామన్నారు. తాగునీటి పైప్‌ లైన్లు, ఓపెన్‌ డ్రైనేజ్‌ పైప్‌ లైన్స్‌ పక్క పక్కనే ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదముందని.. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడలో అండర్‌ డ్రౌండ్‌ డ్రైనేజ్‌ పనులు వంద శాతం పూర్తౌెతే ఇటువంటి ఇబ్బందులు రావన్నారు. త్వరలోనే నిధులు కేటాయించి.. పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు.6 మున్సిపాలిటీల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు పనులు చేపడుతున్నామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....