ప్రజావాణి కార్యక్రమంలో 360 దరఖాస్తులు

 

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 360 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 138, విద్యుత్‌ శాఖ కు సంబంధించి 38, పంచాయతి రాజ్‌ మరియు గ్రావిూణాభివృద్ది శాఖ కు సంబంధించి 36, ఎస్సీ సంక్షేమ శాఖ కు సంబంధించి 26, మున్సిపల్‌ శాఖకు సంబంధించి 17, ఇతర శాఖలకు సంబంధించి 105 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్‌ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....