ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి

జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 187 ఆర్జీలు

హైదరాబాద్‌, మార్చి 10 :   ఇయ్యాల తెలంగాణ 

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కవిూషనర్‌ ప్రజల నుండి  ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారం కై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిూషనర్‌ మాట్లాడుతూ… ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయరాదని, ఎప్పటికప్పుడు పరిష్కరించడం పై దృష్టి సారించాలన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ అధికారులకు ఆదేశించారు. 

జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 79 విన్నపాలు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి 49, ట్యాక్స్‌ సెక్షన్‌ 12, ఇంజనీరింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలకు మూడు చొప్పున, యు.సి.డి, హెల్త్‌, ఫైనాన్స్‌ విభాగాలకు రెండు చొప్పున, జోనల్‌ ఆఫీస్‌ (కూకట్‌ పల్లి), శానిటేషన్‌, ఎలక్ట్రికల్‌, లేక్స్‌ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందగా,  ఫోన్‌ ఇన్‌ ద్వారా రెండు ఫిర్యాదులు అందాయి. 

జిహెచ్‌ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 108 అర్జీలు అందగా, అందులో కూకట్‌ పల్లి జోన్‌ లో 56,   సికింద్రాబాద్‌ జోన్‌ లో 13, శేరిలింగంపల్లి జోన్‌ లో 18, చార్మినార్‌, ఎల్బీనగర్‌ జోన్‌ లలో 10 చొప్పున, ఖైరతాబాద్‌ జోన్‌ లో ఒక్క ఫిర్యాదు అందింది. 

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్లు వేణుగోపాల్‌, గీతా రాధిక, పంకజ, వేణుగోపాల్‌ రెడ్డి, చంద్రకాంత్‌ రెడ్డి, సీపీ పి శ్రీనివాస్‌, సి ఎం అండ్‌ హెచ్‌ ఓ డాక్టర్‌ పద్మజ, యు.బి.డి డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌ రావు, వెటర్నరీ చీఫ్‌ అబ్దుల్‌ వకీల్‌, అడిషనల్‌ సి.సి.పి గంగాధర్‌, జోనల్‌ సిపి లు, ఎస్టేట్‌ అధికారి ఉమా ప్రకాష్‌, డిప్యూటీ సీఈ పనస రెడ్డి, హౌసింగ్‌ ఈఈ లు పీవీ రమణ, రాజేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....