ప్రజాశాంతి పార్టీలో చేరిన Babu మోహన్‌

హైదరాబాద్‌, మార్చి 04 (ఇయ్యాల తెలంగాణ) : హస్య నటుడు బాబు మోహన్‌ సోమవారం నాడు ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్‌ ఆధ్వర్యంలో చేరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా బాబు మోహన్‌ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అని కేఏ పాల్‌ తెలిపారు. గతంలో పనిచేసిన పార్టీలో విలువ లేకనే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్‌ వెల్లడిరచారు. బిజెపిలో పార్టీ కొరకు ఎంతో పనిచేశా. కానీ తనకు సరైన  పదవి, గౌరవం లేకనే ఆ పార్టీని వేడాల్సి వచ్చిందని అన్నారు.

పార్టీ కొరకు ఎంతో సేవ చేసిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బాబు మోహన్‌. రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని తప్పక విజయం సాధిస్తానని అయన పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....