ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ తరహా వైద్యం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 19 (ఇయ్యాల తెలంగాణ ):ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్‌ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్‌ రావుఅన్నారు. ఎంఎన్‌జీ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్‌ సర్జికల్‌ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్‌ ఎక్విప్మెంట్‌ను హరీశ్‌ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్‌ సర్జికల్‌ సిస్టం (రూ.32 కోట్లు), లాప్రోస్కోపిక్‌ ఎక్విప్మెంట్‌ (రూ.50 లక్షలు) ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎమ్‌ఎన్‌ జే ఆసుపత్రిలో 3 ఆపరేషన్‌ థియేటర్లు మాత్రమే ఉండేవని, అవి కూడా దాదాపుగా 60 సంవత్సరాలు క్రితం నిర్మించినవని, కొత్త వాటిని నిర్మించాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదని మంత్రి హరీశ్‌ వెల్లడిరచారు. అంతేకాదు ఓటి కాంప్లెక్స్‌ లో సరైన వసతులు లేవని, సరైన వెంటిలేషన్‌, సెంట్రల్‌ ఏసీ లేకపోవడం? ఇలా అనేక సమస్యలు ఉన్నాయని మంత్రి గుర్తు చేసారు.

ఎయిమ్స్‌కు సమానంగాసీఎం కేసీఆర్‌ఎ మ్‌ఎన్‌ జే ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారని, 8 అధునాతన రోబోటిక్‌ సహా ఎనిమిది మాడ్యులర్‌ థియేటర్లను ఇప్పటికే ప్రారంభించామని హరీశ్‌ తెలిపారు. రూ. 32 కోట్లతో రోబోటికల్‌ సర్జికల్‌ ఎక్వైంట్‌ సమకూర్చుకున్నాం, పక్కనే మరో 350 పడకలతో కొత్త బ్లాక్‌ ప్రారంభించుకున్నామని మంత్రి చెప్పారు. మొత్తం 750 పడకల ఆసుపత్రిగా దేశంలో అతిపెద్ద కేన్సర్‌ ఆసుపత్రిగా రికార్డ్‌ నెలకొల్పిందని, మన ఎంఎన్‌ జే అందిస్తున్న సేవలు, ఢల్లీిలోని ఎయిమ్స్‌ ద్వారా అందిస్తున్న సేవలకు సమానమని మంత్రి వెల్లడిరచారు. అంతేకాదు దేశంలోనే తొలిసారి ఎం ఎన్‌ జే అధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్‌ నర్సింగ్‌ స్కూల్‌ త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడిరచారు. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకు సైతం మొబైల్‌ స్క్రీనింగ్‌ సేవలు చేరువ చేస్తున్నామని హరీశ్‌ చెప్పారు.

స్టేట్‌ కాన్సర్‌ సెంటర్‌గా;ఎంఎన్‌జీ ఆసుపత్రిని రూ. 120 కోట్లతో స్టేట్‌ కాన్సర్‌ సెంటర్‌గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం నిమ్స్‌, ఎం ఎన్‌ జేలో ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి (బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌) శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని హరీశ్‌ వెల్లడిరచారు. ప్రైవేటులో 25 లక్షల ఖర్చు అయ్యే బొన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేశన్‌ చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేకాదుఅవసాన దశలో ఉన్నవారికి సేవలు అందించేందుకు ఉదేశించిన పాలియేటివ్‌ కేర్‌ సేవలను 33జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నామని హరీశ్‌ గుర్తు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....