ప్రమాదం నుంచి తప్పించుకున్న విశాఖ కార్పోరేటర్లు

 
శాఖ పట్నం సెప్టెంబర్  15 (ఇయ్యాల తెలంగాణ ): స్టడీ టూర్‌ పేరిట జమ్మూ కాశ్మీర్‌ లో పర్యటిస్తున్న విశాఖ కార్పో రేటర్లు ప్రమాదం నుండి తప్పించుకు న్నారు. కార్పోరేటర్ల బస్సు రోడ్డు ప్రమా దానికి గురయ్యింది.ప్రస్తుతం స్టడీ టూరులో భాగంగా జమ్మూ కాశ్మీర్‌ లో పర్యటిస్తున్న విశాఖ కార్పోరేటర్ల బస్సు ప్రమాదానికి గురయ్యింది. కాట్రా నుం డి జమ్మూకు 70 మంది కార్పోరేటర్లతో వెళుతున్న బస్సు మరో బస్సును ఢీకొట్టి పుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుండి కార్పో రేటర్లంతా సురక్షితంగా బయటప డ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు.అయితే ప్రమాదానికి గురయి న కార్పోరేటర్ల బస్సు స్వల్పంగా దెబ్బ తింది. దీంతో బస్సు రిపేర్‌ అనంతరం అదే బస్సులో విశాఖ కార్పోరేటర్లు జమ్మూకు చేరుకున్నారు.ఈ నెల 10న విశాఖపట్నం కార్పోరేటర్లు జమ్మూ కాశ్మీర్‌ తో పాటు పంజాబ్‌ పర్యటనకు బయలుదేరారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ప్రజల జీవన విధానంను, పాలనను పరిశీలిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....