ప్రమాదపు అంచున కడెం ప్రాజెక్ట్‌

నిర్మల్‌, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : కడెం ప్రాజెక్టు డేంజర్‌ జోన్‌ లో  చిక్కుకుంది.  ప్రాజెక్ట్‌ విూద నుండి ఓవర్‌ వరద నీరు ఫ్లో అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కడెం ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల పూర్తిగా జలమయంలో దిక్కుకున్నాయి. 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు భారీగా వరద  నీరు వచ్చి చేరుకుంతోంది. జలాశయాల నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. తెలంగాణ, నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఎగువ నుంచి వచ్చే వరదలతో పాటు భారీ వర్షాలతో అంచనాలకు మించి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహిస్తుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....