ప్రముఖ సంఘ సేవకులు వగ్గు Bal Raj ఇకలేరు !

హైదరాబాద్, జూలై 23 (ఇయ్యాల తెలంగాణ) ప్రముఖ సంఘ సేవకులు, సీనియర్ MBT పార్టీ నాయకులు వగ్గు బాల్ రాజ్ స్వర్గస్తులైనారు. అర్ధరాత్రి 12 గం! 30 ని ప్రాంతంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వగ్గు బాలరాజ్ అనేక సేవ కార్యకమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పాతనగరంలో గతంలో చాంద్రాయణ గుట్ట నియోజక వర్గం నుంచి MLA గా ఉన్న అమానుల్లా ఖాన్ తో ఎన్నో ఏళ్ళు పని చేశారు. అంతే కాకుండా రాష్ట్ర SC / ST ఐక్య వేదిక కార్యదర్శిగా ఉన్నారు. మాదిగ సేవ సంఘం , దేవాలయ కమిటీల్లో కూడా బాలరాజ్ విశిష్ట సేవలు అందించారు. గత కొంత కాలంగా ఆయన ఉదర సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు.  ఈ రోజు మధ్యాహ్నం కందికల్ గేట్ లో గల హిందూ స్మశాన వాటికలో మధ్యాహ్నం 1 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....