ప్రసన్న కుమార్‌ నాని దర్శకత్వంలో రూపొందనున్న ఇంటెన్స్‌ న్యూఏజ్‌Crime థ్రిల్లర్‌ కథకళి

ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌ గా లాంచ్‌ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. హర్షిత్‌ రెడ్డి కెమరా స్విచాన్‌ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్‌ అందించగా ఫస్ట్‌ షాట్‌ కి డైరెక్టర్‌ ప్రసన్న కుమార్‌ నాని దర్శకత్వం వహించారు.మధు దామరాజు, మైమ్‌ మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్‌ టెక్నిషియన్స్‌ పని చేస్తున్నారు. పవన్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా, జితిన్‌ మోహన్‌ డీవోపీగా పని చేస్తున్నారు. నాగేంద్ర ఆర్ట్‌ డైరెక్టర్‌.గ్రిప్పింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కథకళి’ ప్రేక్షకులను సస్పెన్స్‌, భావోద్వేగాలు, రోలర్‌కోస్టర్‌ రైడ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ని అందించనుంది.నటీనటుల్లో అనుభవజ్ఞుడైన బ్రహ్మాజీ, తన ఇంటెన్సిటీతో క్యారెక్టర్‌ కి యూనిక్‌ నెస్‌ తీసుకోస్తున్నారు. గ్రౌండెడ్‌ పెర్ఫార్మెన్స్‌లకు పేరున్న యశ్వంత్‌ పెండ్యాల, అలాగే దామరాజు మధూ ప్రీత కూడా కథలో భావోద్వేగ, డ్రామాటిక్‌ లేయర్స్‌కు బలం జోడిస్తున్నారు. ప్రతి పాత్ర ప్రత్యేకమైన ఆర్క్‌తో రూపొందించబడుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల సీట్‌ ఎడ్జ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ని అందించబోతోంది.

మూవీ లాంచింగ్‌ ప్రెస్‌ విూట్‌ లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. కథాకళి టీంకి బిగ్‌ కంగ్రాట్యులేషన్స్‌. యశ్వంత్‌ మా కమిటీ కుర్రాళ్ళు సినిమాల్లో నటించాడు. తన కొత్త సినిమా ముహూర్తానికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాజీ గారు యశ్వంత్‌ కి చాలా మంచి సపోర్ట్‌ ఇస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా హ్యుజ్‌ బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను.  హర్షిత్‌ రెడ్డి మాట్లాడుతూ…కథాకళి టీం కి కంగ్రాజులేషన్స్‌. బ్రహ్మాజీ గారికి కంగ్రాట్యులేషన్స్‌. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.బ్రహ్మాజీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాన్యతా ప్రొడక్షన్స్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్‌ అయింది. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో కథ హీరో. కాన్సెప్ట్‌ చాలా బాగుంది. నెక్స్ట్‌ మంత్‌ విూ బ్లెస్సింగ్స్‌ కావాలి’అన్నారు.  డైరెక్టర్‌ ప్రసన్న కుమార్‌ నాని మాట్లాడుతూ. మంచి ఇంట్రెస్టింగ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ తో వస్తున్నాం నెక్స్ట్‌ మంత్‌ షూట్‌ స్టార్ట్‌ కాబోతోంది. అందరికీ థాంక్యు. ఈవెంట్‌ కి వచ్చిన అందరికీ థాంక్యు’అన్నారునిర్మాత మాట్లాడుతూ.. ఈ లాంచింగ్‌ ఈవెంట్‌ కి వచ్చిన అతిథులందరికీ థాంక్యూ సో మచ్‌. వారందరూ సపోర్ట్‌ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బ్రహ్మాజీ గారు ఇందులో చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. చాలా మంచి టీం తో కలిసి సినిమా చేస్తున్నాం’అన్నారు  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....