ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో BC బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ తరహా ఉద్యమం చేస్తాం : R.కృష్ణయ్య

న్యూ ఢిల్లీ, మార్చి 30 (ఇయ్యాల తెలంగాణ) : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టక పోతే మిలిటెంట్ తరహా ఉద్యమం చేస్తామని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. మంగళవారం డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద బీసీల మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ బిల్లు కోరుతూ వందలాది మంది బీసీలు పార్లమెంట్ ముట్టడీకీ యత్నించారు. పార్లమెంట్ స్ట్రీట్ మీదుగా పార్లమెంట్ వైపు వేళ్ళేందుకు బారికేట్లను దూకే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలోని 75కోట్ల మంది బీసీలకు రాజ్యంగ పరమైన హాక్కులు, మానవ హక్కులు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం  అణిచి వేస్తుందని అన్నారు. బీసీల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎలాంటి పధకాలు రాయితీలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 

BC ల జనాభా 56శాతం ఉంటే 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు పేట్టారన్నారు. పంచాయతీ రాజ్ సంస్థల లోని బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22శాతంకు తగ్గించారని చేప్పారు. కేంద్ర బడ్జెట్ 38 లక్షల 45వేల కోట్లు ఉంటే బీసీలకు కేవలం రూ, 1400 కోట్లు కేటాయిస్తారా? అని నిలదీశారు. ఇంత తక్కువ బడ్జెట్ తో దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు బిస్కెట్లు కూడా రావన్నారు. బీసీల డిమాండ్ లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను దేశ వ్యాప్తంగా అడ్డుకుంటామని అన్నారు. బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకుని బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హాక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు వేనుకాడు తున్నారని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు రాజ్యంగ బద్ధమైన హాక్కు అని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు సాధించే వరకు వెనక్కీ తగ్గేది లేదని బీసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ మీడియాతో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ తో బీసీలు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 39.85 లక్షల కోట్ల బడ్జెట్ ను అగ్రవర్ణాలు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య  వ్యాపార సంస్థలు తిసుకొని పోతుంటే బీసీలు చూస్తూ ఉరుకోరన్నారు. అందులో 50 శాతం వాటాను చట్ట బద్దంగా బీసీలకు దక్కాలన్నారు. న్యాయ వ్యవస్థ లో కూడా 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఐటిలు, ఐఐంలు, ఎయిమ్స్, కేంద్రియ విద్యాలయాల్లో స్కాలర్ షిప్ లు సకాలంలో అందక బీసీ బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువల్ల ప్రయివేటు రంగ సంస్థల్లో 50శాతం బీసిలకు రిజర్వేషన్లను అమలు చేయాలని దాసు సురేష్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడీలో బీసీ నేతలు గుజ్జ క్రిష్ణ, క్రృష్ణా, నీల వేంకటేశ్, జి, అనంతయ్యా, భూపేశ్ సాగర్, వేముల రాధాకృష్ణ, బీసీ వేంకట్, జక్కుల వంశీ కృష్ణ, జక్కని సంజయ్, ఉదయ్, అరవింద్, లింగయ్య యాదవ్, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....