ప్రియురాలి కోసం ! భర్త హత్య

మెదక్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. జిల్లాలోని రాయికోడ్‌ మండలం నల్లంపల్లి గ్రామంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం కృష్ణ హత్యకు గురయ్యాడు. అయితే, వివరాల్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలి భర్తను ప్రశాంత్‌ అనే యువకుడు చంపేశాడు.కంట్లో కారం పొడి చల్లి, కర్రలు, రాడ్లతో కృష్ణను చితకబాదిన ప్రశాంత్‌ దారుణంగా హత్య చేశాడు. కృష్ణ భార్యకి అదే గ్రామంలో ఆటో డ్రైవర్‌ గా పని చేస్తున్న ప్రశాంత్‌ కి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. 

గతంలో వివాహేతర సంబంధం కారణంగా ప్రశాంత్‌, కృష్ణ కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే, గొడవల కారణంగా కృష్ణ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన ప్రియురాలు వెళ్లిపోవడానికి కారణం కృష్ణనే అంటూ పగ పెంచుకున్న కృష్ణ ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన తర్వాత రాయికోడ్‌ పోలీస్‌ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ దారుణ హత్యపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ హత్య కేసులో మృతుడి భర్య హస్తం కూడా ఏమైన ఉందా అనే విధంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.. ఎన్నాళ్ల నుంచి కృష్ణ భార్య, ఆటో డ్రైవర్‌ ప్రశాంత్‌ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది అనే దానిపై విచారణ జరుగుతుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....