రంగారెడ్డి జులై 4, (ఇయ్యాల తెలంగాణ ):మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా నగర్ లో ప్లాస్టిక్ బాటిల్స్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో గోదాంఎవరు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.