ఫలక్‌ నామా ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు..ప్రయాణికులు సురక్షితం

యాదాద్రి  జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):యాదాద్రి జిల్లా భువనగిరి మండలం, పగిడిపల్లి సవిూపంలో ఫలక్‌ నామా ఎక్స్‌ ప్రెస్‌ బోగిలో మంటలు చెలరేగాయి. రైలు పశ్చిమ బెంగాల్‌ హౌరానుంచి హైదరాబాద్‌ కు వస్తున్న సమయంలో ఘటన జరిగింది. మంటలను గమనించిన లోకో పైలట్‌ ట్రైన్‌ ను పగిడిపల్లిలో నిలిపివేసాడు. షాట్‌ సర్కూట్‌ తో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీసారు. మంటల్లో పూర్తిగా రెండు భోగీలు దగ్ధమైనట్లు సమాచారం. ప్రయాణికుల దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....