ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ ‘జనక అయితే గనక’ .. First Look విడుదల

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుహాస్‌ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’ .. ఫస్ట్‌ లుక్‌ విడుదల

తెలుగు సినీ ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్‌ విూ వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ తర్వాత ఈ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ కోర్టు డ్రామా ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ మంగళవారం విడుదల చేశారు.ఫస్ట్‌ లుక్‌ను గమనిస్తే.. సినిమా టైటిల్‌ ఉన్న పలకను పట్టుకున్న హీరో సుహాస్‌ దాన్ని ఓరగా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్టర్‌లో న్యాయదేవత బొమ్మ, చిన్నపిల్లలకు సంబంధించిన స్కూల్‌ బ్యాగ్‌, స్కూల్‌ బస్‌,  టెడ్డీ బేర్‌ బొమ్మలను గమనించవచ్చు. హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న సుహాస్‌ మరోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫరెంట్‌ మూవీతో అలరించటానికి సిద్ధమవుతున్నారు.సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్‌ తెలియజేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....