బతుకమ్మ నుంచి కవిత రీ Entry

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28, (ఇయ్యాల తెలంగాణ) : బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత? ఇప్పటివరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కవిత? బెయిల్‌ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా సైలెంట్‌గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజమాబాద్‌లోనూ ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఐతే, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తనపై రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్‌ అయ్యారట కవిత. అందుకే తన రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం తన బ్రాండ్‌ బతుకమ్మను వేదికగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ సంబరాలతో తనకో బ్రాండ్‌ సంపాదించుకున్నారు కవిత. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలకు ప్రాచుర్యం తీసుకువచ్చారు. ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కవిత? ఇప్పుడు బతుకమ్మ పండగ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. 

గతంలో కంటే దూకుడుగా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు? తనపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు కౌంటర్‌ ఇస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నారని సమాచారం. సరైన వేదిక కోసం చూస్తున్న కవిత? బతుకమ్మ పండుగను సద్వినియెగం చేసుకోవాలనుకుంటున్నారని అంటున్నారు.ఇప్పటికే కవిత పార్టీ సీనియర్స్‌, మేధావులతో సమావేశమై, రాజకీయ వ్యుహాలపై సమాలోచనలు చేస్తున్నారట. మెజారిటీ నేతలు బతుకమ్మతోనే గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని సూచన చేసినట్లు చెబుతున్నారు. ఇక కవితను కలుస్తున్న కార్యకర్తలు సైతం బతుకమ్మతోనే ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు అధికారం కోల్పోయిన నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఓటమి భారంతో అధినేత ఫామ్‌ హౌస్‌లోనే ఎక్కువగా గడుపుతుండగా, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పార్టీ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు. వీరికి కవిత కూడా తోడైతే రాజకీయంగా బలం పుంజుకోవచ్చని భావిస్తున్నారు.ఇక ప్రజల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది? ఆమె రోల్‌ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. కుమార్తె రీ ఎంట్రీ విషయంలో అధినేత కేసీఆర్‌ ఆలోచనలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఢల్లీి స్థాయిలో బాధ్యతలివ్వాలా? రాష్ట్ర స్థాయిలోనా? అనేది ఇంకా తెలియరాలేదు. ఏదిఏమైనా కవిత రీ ఎంట్రీతో బీఆర్‌ఎస్‌లో జోష్‌ తీసుకురావాలనే ప్లానింగ్‌ జరుగుతోందంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....