బాంబు బెదిరింపుతో ఆగిన కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌

సికింద్రాబాద్‌, జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ ) : తిరుపతి నుండి ఆదిలాబాద్‌  వెళ్లే కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌  కు బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీసారు. ముందుగా ఒక  గుర్తు తెలియని ఆగంతకుడు దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్‌ రూమ్‌ కు ఫోన్‌ చేయడంతో   అప్రమత్తమైన రైల్వే పోలీసులు,  రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు, రైలు ను మౌలాలి  రైల్వే స్టేషన్‌ లో అపివేసారు.  ట్రైన్‌ మొత్తం తనిఖీ చేశారు.  బాంబ్‌ లేకపోవడంతోఅందరూ  ఉపిరి పీల్చుకున్నారు.  ఫోన్‌ చేసిన వ్యక్తి కిరణ్‌ కుమార్‌ (23) గా గుర్తించారు. కిరణ్‌ కుమార్‌ మతిస్థిమితంలేనివాడని గుర్తించారు. కిరణ్‌ గతంలో ఎస్సై  పోస్ట్‌ కోసం ప్రిపేర్‌ అయ్యాడు. ఒక ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయాడని  పోలీసులు తెలిపారు. తరువాత కృష్ణ ఎక్స్‌ ప్రెస్‌  మౌలాలి నుండి సికింద్రాబాద్‌ చేరుకుంది, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో భారీగా మోహరించిన గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ తో మరోసారి తనీఖీలు చేశారు. ఫేక్‌ కాల్‌ అని నిర్ధారణ అయిన తరువాత ట్రైన్‌ సికింద్రాబాద్‌ నుండి ఆదిలాబాద్‌ బయలుదేరింది.  గంట సమయంలో ప్రయాణికులు భయబ్రాంతులకు గురిఅయ్యారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....