బిజెపికి తలనొప్పిగా మారిన రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం

హైదరాబాద్‌ జూన్‌ 30 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. సస్పెన్షన్‌ తొలగించాలంటూ కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు రెండు సార్లు బండి సంజయ్‌ లేఖ రాశారు. రాజసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారంపై విజయశాంతి ట్వీట్‌ చర్చ నీయాంశంగా మారింది. సస్పెన్షన్‌ ఎత్తివేత ఆలస్యమవుతోందని కార్యకర్తలు భావిస్తున్నారని విజయశాంతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ ఎత్తివేత ఆలస్యమైతే పార్టీకీ నష్టం తప్పదని కార్యకర్తలు అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీకి రాజసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. 

విజయశాంతి తన ట్వీట్‌లో ఏమన్నారంటే…

‘‘ఎమ్మెల్యే రాజాసింగ్‌ గారి సస్పెన్షన్‌ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నరు. అయితే, బండి సంజయ్‌ గారితో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్‌ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నము. అలాగే జరుగుతుందని నమ్ముతున్నం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతాది. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుంది’’ అని విజయశాంతి ట్వీట్‌లో పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....