బిటిష్‌ హై కవిూషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌ జనవరి 25 (ఇయ్యాల తెలంగాణ ): లండన్‌ లోని థేమ్స్‌ రివర్‌ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్‌ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్‌ పర్యటనలో అక్కడ థేమ్స్‌ నది నిర్వహిస్తున్న తీరు, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును  ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్‌ లో హైదరాబాద్‌ లో మూసీనది  పునరుజ్జీవింపజేసేందుకు  చేస్తున్న ప్రణాళికలను,  ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్‌ లైన్‌, థేమ్స్‌ నది తరహాలో అభివృద్ధి,  తదితర అంశాలను ఆయనతో చర్చించారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్‌ హై కవిూషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తో భేటీ అయ్యారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత  ప్రాధాన్యమిస్తున్నట్లు,   నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.సీఎం దార్శనికతకు, నది పరీవాహిక ప్రాంత అభివృధి చేపట్టటం పట్ల బ్రిటిష్‌ హై కవిూషనర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్‌  డెవలప్మెంట్‌, ఎకో టూరిజం కు  తమ సహకారం ఉంటుందని ఎల్లిస్‌ అన్నారు.  ఈ సమావేశంలో  ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి,  డిప్యూటీ హై కవిూషనర్‌  గారేత్‌ వైన్‌ ఒవేన్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....