బీజేపీ ఓబీసీ మోర్చా & సనత్ నగర్ పరివార్ తుక్కుగూడ వెళ్లిన దృశ్యాలు

సనత్ నగర్, మే 15 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా సంఘీభావంగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా తుక్కగూడకు విచ్చేయుచున్నందున దాదాపు ఐదు లక్షల మంది కార్యకర్తలను సమీకరించాల్సిందిగా సంకల్పించడమైనది. కావున బీజేపీ సభ్యులందరినీ అత్యధిక సంఖ్యలో ఈ ముగింపు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అనగా శనివారం మధ్యహ్నం గం.2.30 ని. లకు సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నుండి తరలి వెళ్ళే కార్లను జెండా ఊపి ప్రారంభించిన నాయకులు. బీజేపీ సనత్ నగర్ పరివార్ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, చరణ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, ఆకూరి శ్రీనివాస్ రావు, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, మల్లిఖార్జున్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, దశరథ్, సుధాకర్, లక్ష్మణ్, కుషాల్, బే వి శ్రీనివాస్, రమేష్, గోపి తదితరులు తరలివెళ్ళినట్లు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పొలిమేర సంతోష్ కుమార్ తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....