బుజ్జి కోసం… డార్లింగ్‌ కష్టం – ‘కల్కి 2898 ఏడీ’ Movie బృందం.

హైదరాబాద్‌, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : బుజ్జిని పరిచయం చేసింది ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బృందం. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఆ స్పెషల్‌ కారును ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కేవలం ఆ కారును మన అందరికీ చూపించడం కోసమే వైజయంతీ మూవీస్‌ సంస్థ పెద్ద ఈవెంట్‌ చేసింది. ఆ వేడుకలో ప్రభాస్‌ సందడి కాసేపు మాత్రమే ఉందని డై హార్డ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు అనిపించవచ్చు. కానీ, ఆ కాసేపటి కోసం ప్రభాస్‌ పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా తక్కువ మందికి మాత్రమే అది తెలుసు.సాధారణంగా సినిమా ఈవెంట్స్‌ అంటే హీరోలు వస్తారు. కాసేపు మాట్లాడాతారు. ఆ సినిమా గురించి చెప్పి వెళ్లిపోతారు. ఎక్కడో రాజమౌళి, శంకర్‌ లాంటి దర్శకులు కాస్త వినూత్నంగా ఆలోచించి స్టేజి విూదకు హీరోలను తీసుకు వచ్చే ప్రోగ్రామ్స్‌ పెడతారు. నాగ్‌ అశ్విన్‌ వాళ్లిద్దరికీ ఏమాత్రం తీసి పోలేదు. ‘కల్కి’లో బుజ్జికి (కారుకు) చాలా ఇంపార్టెన్స్‌ ఉంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో హీరోకి సాయం చేస్తుంది. అందుకని, ఆ బుజ్జిని ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేసే ప్రోగ్రామ్‌ పెట్టారు. ఈవెంట్‌ గ్రౌండ్‌ నుంచి ప్రభాస్‌ ఎంట్రీ వరకు స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు నాగ్‌ అశ్విన్‌.సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో కనిపించే వెహికిల్స్‌తో పోలిస్తే బుజ్జి ప్రత్యేకం. దీన్ని డ్రైవ్‌ చేయవచ్చు. సైఫై సినిమాలు తీసే దర్శకులు అందరూ డ్రైవ్‌ చేసేలా వెహికల్స్‌ డిజైన్‌ చేయరు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ / గ్రాఫిక్స్‌ వాడతారు. నాగ్‌ అశ్విన్‌ టీం ఆ రూల్‌ బ్రేక్‌ చేసి, డ్రైవ్‌ చేసే వెహికల్‌ తయారు చేయించింది. అలాగని, బుజ్జిని డ్రైవ్‌ చేయడం అంత సులభం కాదు. కొంచెం కష్టమే.

’కల్కి’ ఈవెంట్‌లో బుజ్జిని డ్రైవ్‌ చేసుకుంటూ ప్రభాస్‌ వచ్చారు కదా! ఆ డ్రైవింగ్‌ కోసం, ముఖ్యంగా ఆ గ్రౌండులో డ్రైవ్‌ చేయడం కోసం మూడు రోజుల పాటు రోజుకు ఐదు గంటల చొప్పున ప్రభాస్‌ ప్రాక్టీస్‌ చేశారని ఈవెంట్‌ అయ్యాక విూడియాతో నిర్మాత స్వప్న దత్‌ తెలిపారు. ఓపెన్‌ ఏరియాలో బుజ్జిని డ్రైవ్‌ చేయడం సులభమే ఏమో! కానీ, చుట్టూ బారికేడ్స్‌ ఉన్నప్పుడు బుజ్జితో రౌండ్స్‌ వేయడం అంత ఈజీ కాదు. రైట్‌ లేదా లెఫ్ట్‌ టర్నింగ్‌ తీసుకోవాలంటే ప్రాక్టీస్‌ అవసరం. అందుకే, ప్రభాస్‌ అంత కష్టపడ్డారు. మూవీ విూద రెబల్‌ స్టార్‌ డెడికేషన్‌ చెప్పడానికి ఇదొక్కటీ చాలదూ!

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....