బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ KAVITA కు మరోసారి నిరాశే !


మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం

న్యూఢిల్లీ, మే 14 (ఇయ్యాల తెలంగాణ) :  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. నేటితో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక విచారణ జరిగింది. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ పొడగించాలని కోర్టును ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జుడీషియల్‌ కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20 న విచారణ జరుపుతామని రౌస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది.కాగా ఢిల్లీ మద్యం స్కామ్‌లో మనీలాండరింగ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో (మంగళవారం) ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....