బైపాస్‌ రోడ్డు కల సాకారం చేయండి

 

`

   పెద్దపల్లి జూన్ ,27,(ఇయ్యాల తెలంగాణ ): అర్బన్‌ మండలం కోరుతూ సంతకాల సేకరణ

వేగంగా విస్తరిస్తున్న పెద్దపల్లికి బైపాస్‌ రోడ్డు లేక  నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దకల్వల నుండి అప్పన్నపేట వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించాలని, పెద్దపల్లిని అర్బన్‌, రూరల్‌ మండలాలుగా విభజించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్‌ ఈర్ల స్వరూప సురేందర్‌ మాట్లాడుతూ, 15యేళ్ళ క్రితం ఎమ్మెల్యే దివంగత ముకుందరెడ్డి బైపాస్‌ రోడ్డును కోరుతూ ప్రభుత్వానికి నివేదికలు అందజేశారని, ప్రభుత్వం కూడా  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉత్తర`దక్షిణ భారతాన్ని కలిపే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలది భారీ వాహనాలు పెద్దపల్లి గుండా ప్రయాణిస్తున్నా యని, దీనివల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారిలో పోలీసు శాఖకు చెందిన మహిళా ఏఎస్‌ఐ కూడా ఉండటం విచారకరమని వాపోయారు. అడగకుండానే జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌, బైపాస్‌ రోడ్డు నిర్మాణంపై కరుణ చూపాల ని కోరారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి సాంకేతిక కారణాలు ఎదురయినట్లయితే, పెద్దపల్లి పట్టణం నుండి ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అదేవి ధంగా పరిపాలనా సౌలభ్యం కోసం పెద్దపల్లి అర్బన్‌, రూరల్‌ మండలాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....