హైదరాబాద్, జూలై 15 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది గాంచిన బోనాల ఉత్సవాలు హైదరాబాద్ మహానగరంలో సంస్కృతీ, సాంప్రదాయాలకు ఆనవాళ్ళు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బోనాల ఉత్సవాలు జనాల్లో ఆద్యంతం భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అషై ్ట ష్వర్యాలు కలిగిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడా నికై, తమకు అమ్మ వార్లు రక్షణ కలిగించడంతో పాటు అండంగా ఉంటార నేది అనాదిగా వస్తున్న ఆచారం. కొన్ని వందలు ఏళ్ళుగా జరుగుతున్న బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటున్న విశిష్ఠ పండుగ. అంతేకాకుండా తాము అమ్మవారికి సమర్పించే బోనాల వలన ఆ తల్లి చల్లని దీవెన మాకు ఎళ్ళవేళలా లభిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆ విశ్వాసమే సమస్త మానవాళిని ముందుకు నడిపిస్తోం ది.ముఖ్యంగా భగవంతుడిపై ఉన్న నమ్మకం క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అందజేస్తుంది.మంచి,చెడుల సంగమం సాంస్కృతీ,సాంప్రదాయాలపై బలమైన స్థిరత్వాన్ని పొందేటట్లు చేస్తాయి.అందుకే బోనాల పండుగ అడుగ డుగునా మనందరికీ భక్తితో కూడిన ఉత్సవాలను తలపిస్తూ ఉంటాయి.అనేక చోట్ల బోనాల వేడుకలంటే యువకులకు ఎంతో ఆనందదాయకం.అందుకే బోనాల పండు గ వచ్చిందంటే యువకుల ఆనందానికి అవదులుండవు.
బోనాల ఉత్సవాలు మహానగరంలో 300 సంవత్స రాల క్రితం నుంచే కొనసాగుతున్నట్లు మన చరిత్ర పేజీలు చెబుతున్నాయి. 300 సంవత్సరాల క్రితమే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఏర్పడినట్లు సమాచారం. గోల్కొండ కోట నిర్మితం కాకమునుపే ఎల్లమ్మ బోనాలు ప్రసిద్దిగాంచాయి. అదేవిధంగా అబుల్ హసన్ తానీషా కాలంలో జగదాంబికా మహంకాళి ఆలయ నిర్మాణం జరిగింది.ప్రతి ఏటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
మొట్టమొదట గోల్కోండ కోట బోనాలతో ప్రారంభ ౖయ్యే బోనాలు పాతనగరం బోనాలతో ముగుస్తాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాలనే లస్కర్ బోనాలుగా పిలుస్తారు.లస్కర్ బోనాలకు కూడా రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది.1815 సంవత్సరంలో మహంకాళీ దేవాలయ నిర్మాణం జరిగింది.