బోనాల జాతరలో – పోతురాజుల విన్యాసమే కీలకం

హైదరాబాద్ , జులై 24 (ఇయ్యాల తెలంగాణ) :

బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పోతురాజుల ఆట పాటలు లేకుంటే బోనాల పండుగలో అసలు జోష్ కనిపించదు. బోనాల జోష్ అంతా పోతురాజుల వీరంగంతోనే ముందుకు సాగుతుంది. తీన్మార్ మోతలతో పోతురాజుల వేషధారణలు లేకుంటే  యువతలో ఉత్సాహం కనిపించదు. బోనాల పండుగ వచ్చిందంటే చాలు యువతలో కేరింతలు పోతురాజుల స్టెప్పులతోనే  కొనసాగుతాయి. పోతురాజుల చుట్టూ చేరి వారు చేసే చేష్టలు అంత  ఇంత  కాదు. ఒకప్పుడు బోనాల వెంబడే పరిమితమయ్యే పోతురాజులు ఇప్పుడు గ్రూపులుగా జత కట్టి ప్రత్యేక విన్యాసాలతో వీధుల వెంట తిరుగుతూ అత్యంత ఉత్సాహాన్ని నింపుతున్నారు. పోతురాజుల చుట్టూ వందల సంఖ్యలో యువకులు చేరి వారి నృత్య విన్యాసాలకు వీరంతా కేరింతలు కొడుతూ పోతురాజులకు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తారు. ఆనంద ఉత్సహ వేడుకలతో వీధుల్లో సందడి చేస్తారు. బోనాల జాతరలో అమ్మవారి తమ్ముడిగా పిలువబడే పోతురాజుకు ఉన్న క్రేజీ ఏ మాత్రం తగ్గక పొగా యువతలో రెట్టింపు ఉత్సహం అందిస్తోంది. దీంతో యువకుల్లో పోతురాజుల విన్యాసాలపై ఉన్న మక్కువ అత్యంత ఉత్సాహాన్ని అందిస్తోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....