బోయిన్పల్లిలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య!

సికింద్రాబాద్‌ అక్టోబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ); బోయిన్పల్లి పీఎస్‌ పరిధిలోని భవానీనగర్లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకన్నారు. మృతదేహాల పక్కనే నిద్రమాత్రలు వున్నాయి. గురువారం  రాత్రి భోజనం చేసిన తరువాత  వీరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను శ్రీకాంత్‌ చారి (42), స్రవంతి (8), శ్రావ్య(7)గా గుర్తించారు.శ్రీకాంత్‌ చారి భార్య అక్షయ మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేవు. రాత్రి భోజనం చేసిన అనంతరం అందరం ఒకే దగ్గర పడుకున్నాము. అర్ధరాత్రి సమయంలో నీళ్లు తాగినందుకు తన భర్త లేచినట్లు తెలిపింది. ఉదయం లేచి చూసేసరికి విగత జీవులుగా పడి ఉండడంతోగ్భ్భ్రాంతికి గురయ్యాము. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పింది. మృతుడి తల్లి జయమ్మ మాట్లాడుతూ కుటుంబమంతా కలిసి ఉంటాము.. అందరం మాట్లాడుకుని రాత్రి పడుకున్నాము. కుటుంబ కలహాలు లేవు.. ఉదయాన్నే వారిని లేపే సరికి స్పృహ కోల్పోయి ఉన్నారు.. ఇద్దరు కూతుర్లు శ్రావ్యా స్రవంతి తో పాటు శ్రీకాంత్‌ నిద్ర మాత్రలు మింగారు.. గత కొంతకాలంగా శ్రీకాంత్‌ సిల్వర్‌ వర్క్‌ సరిగా నడవడం లేదని వెల్లడిరచింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....