భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

విజయవాడ (ఇయ్యాల తెలంగాణ ):ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. నేడు అమ్మవారు భక్తులకు సరస్వతి దేవి  అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారని అధికారులు పేర్కొంటున్నారు.

మరోవైపు, పోలీసులకు, దుర్గ గుడి సిబ్బందికి వాగ్వాదం నెలకొంది. 

ఇంద్రకీలాద్రి పై పోలీసుల అత్యుత్సాహం చూపించారని సిబ్బంది మండిపడ్డారు. విధుల నిర్వహణకు వచ్చిన  ఆలయ సిబ్బందిని పలుచోట్ల పోలీసులు  అడ్డుకున్నారు. ఘాట్‌ రోడ్డు లో సిబ్బంది కి ఇక్కట్లు తప్పలేదు. గుర్తింపు కార్డులు, పాస్‌ లు చూపించినా పంపకపోవడంతో పోలీసుల తీరు పై ఆలయ సిబ్బంది మండిపడ్డారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....