భరత్‌, వాణి భోజన్‌ హారర్‌ Movie ‘మిరల్‌’

ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్‌ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్‌ హీరోగా, వాణి భోజన్‌ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్‌, యాక్సెస్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్‌’ మూవీని  సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మించారు. హారర్‌, సస్పెన్స్‌ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్‌ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌ అందరినీ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్‌ మూవీ విూద అంచనాలు పెరిగాయి.

శ్రీమతి. జగన్మోహిని డ జి డిల్లి బాబు సమర్ఫణలో రాబోతోన్న ఈ సినిమాను మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్‌ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్‌ హైలెట్‌ అయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్‌ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌, పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.

ఈ చిత్రానికి ప్రసాద్‌ ఎస్‌ ఎన్‌ సంగీతాన్ని అందించారు. సురేష్‌ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్‌ ఆర్‌ వ్యవహరించారు.

నటీనటులు : భరత్‌, వాణి భోజన్‌, ఐ.ూ.రవికుమార్‌, విూరాకృష్ణన్‌, రాజ్‌కుమార్‌, కావ్య అరివుమణి తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....