భారత్‌లో యాపిల్‌ కంపెనీలు పెట్టొద్దు.. Trump సంచలన కామెంట్స్‌

న్యూ డిల్లీ మే 15 (ఇయ్యాల తెలంగాణ) : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యాపిల్‌ కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. ఇండియాలో యాపిల్‌ కంపెనీ నిర్మాణాలు నిలిపివేయాలని సీఈఓ టిమ్‌ కుక్‌ను కోరినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం తెలిపారు. దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌.. వాషింగ్టన్‌ భారత్‌తో విస్తృత వాణిజ్య సంబంధాల గురించి చర్చిస్తూ ఈ ప్రకటన చేశారు. ఇండియాలో అత్యధిక టారిఫ్‌ ఉంటుందని.. కాబట్టి, అక్కడ యాపిల్‌ ప్రాడక్ట్స్‌ ఉత్పత్తి చేయొద్దని సీఈవో టిమ్‌ కుక్‌కి చెప్పినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. భారత్‌ లో నిర్మించడం తమకు ఇష్టం లేదని.. అమెరికాలోనే యాపిల్‌ కంపెనీలు పెట్టాలని కోరినట్లు ట్రంప్‌ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....