భార్యపై కత్తితో దాడి కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష 5 వేల జరిమానా

నాంపల్లి, ఆగష్ట్ 30 (ఇయ్యాల తెలంగాణ) : భార్య పైన హత్య ప్రయత్నం చేసి కత్తితో దాడి చేసిన నిందితుడికి  నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా నాంపల్లి మూడవ AMSJ కోర్టు ఈ నెల 28 వ తేదీన అంబర్ పేట ప్రాంతానికి చెందిన నిందితుడు తిరందాస్ రవీందర్ కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.నాంపల్లి మూడవ AMSJ కోర్టు న్యాయమూర్తి టి. అనిత నేతృత్వంలో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధించింది. అంబర్ పేట మల్లికార్జున నగర్ కు చెందిన నిందితుడు తిరందాస్ రవీందర్ పై 2016 వ సంవత్సరంలో 307,498(A) 506 ఐపీసీ చట్టాల కింద అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదై ఉన్నది. 6 సంవత్సరాలుగా కొనసాగిన వాదనల అనంతరం నాంపల్లి మూడవ AMSJ కోర్టు నిందితుడికి ఈ నెల 28 వ తేదీన శిక్షను విధించింది. ప్రత్యేక  నిత్యావసరాల చట్టం కింద న్యాయమూర్తి T. అనిత  నిందితునికి శిక్షను విధించారు. నిందితుడిపై  307,498(A) 506 ఐపీసీ చట్టాల కింద కేసు నమోదై ఉన్నది.ఇన్ స్పెక్టర్ పి.సుధాకర్ పర్యవేక్షణలో సబ్ ఇన్ స్పెక్టర్ కె. మధు సుధన్ రావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆలేటి యాదగిరి కేసు విషయంలో వాదోప వాదనలు కొనసాగించారు. వాదనల అనంతరం నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 5000 రూపాయల జరిమానాను విధించారు. 




iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....