పెద్దపల్లి ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ): ప్రభుత్వ ఉత్తర్వు 59 క్రింద భూముల క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి నిర్దేశించిన రుసుము వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని వీసి హాల్ లో జీఓ 59 భూముల క్రమబద్ధీకరణ, ఇంటి పట్టాల పంపి ణీ, గృహలక్ష్మి పథకం వంటి అంశాల పై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో కలిసి తహసిల్దార్లతో సవిూక్షిం చారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారు లతో మాట్లాడుతూ మొదటి దశలో మన జిల్లాలో క్రమబద్ధీకరణ కోసం 664 మంది దరఖాస్తు దారు లలో ఇప్పటివరకు 27 మంది మాత్రమే పూర్తిగా నిర్దేశించిన రుసుము చెల్లించి క్రమబద్ధీక రణ చేసుకున్నారని, 10 మంది వరకు మొదటి, రెండు విడతల చెల్లింపు చేశారని, 627 మంది దరఖాస్తు దారులు రుసుము చెల్లింపు ప్రక్రియ ప్రారంభించ లేదని, ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి నిర్దేశించిన రుసుము వసూలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 క్రింద రెండవ విడతలో వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, ఆ సమయంలోనే రుసుము చెల్లింపు ప్రక్రియ గురించి లబ్ధిదారులకు వివరించా లని, అలాగే ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 10 వరకు గృహలక్ష్మి పథకం క్రింద దరఖాస్తు స్వీకరించేందుకు ప్రభుత్వం గడువు నిర్దేశించిందని కలెక్టర్ తెలిపా రు. మండలాల పరిధిలోని ప్రజాప్రతి నిధులతో సమన్వయం చేసుకుంటూ గృహలక్ష్మి పథకం దరఖాస్తు అంశం విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. గృహలక్ష్మి పథకం క్రింద జిల్లాలో ప్రతి తహసిల్దార్ కార్యాల యం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాల యంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖా స్తులు స్వీకరించాలని తెలిపారు. పాలకుర్తి మండలంలోని ఎసాల తక్కలపల్లి, మంథని మండలంలోని ఏక్లాస్ పూర్, సుల్తానాబాద్ మండలంలోని రెబ్బదేవపల్లి, శ్రీరాంపూర్ మండలం లోని తారుపల్లి గ్రామాల్లో బలహీనవర్గా లకు ఇంటి స్థలాల పంపిణీ కోసం 11 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, వీటిని 442 ప్లాట్లుగా విభజించామని, 132 ప్లాట్ల ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేశామని, పెండిరగ్ లో ఉన్న ఇంటి పట్టాల పంపిణీ కోసం బలహీన వర్గాల నుంచి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పంపిణీ పూర్తయ్యే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావే శంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మధుమోహన్, కలెక్టరెట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఈ ` సెక్షన్ సూపరిం టెండెంట్ పుష్పలత, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- భూముల క్రమబద్ధీకరణ రుసుం వసూలుకు కార్యాచరణ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
భూముల క్రమబద్ధీకరణ రుసుం వసూలుకు కార్యాచరణ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Leave a Comment