మంచులింగాన్ని దర్శించుకున్న 2 లక్షల 80 వేల మంది

కొలంబో, జూలై 23, (ఇయ్యాల తెలంగాణ)

భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను మరోసారి నిలిపివేశారు. జమ్మూ లోని బేస్‌ క్యాంప్‌ లోనే యాత్రికులను నిలిపివేశారు. అయితే తాము ఎలాగైనా మంచుకొండల్లో వెలిసిన బోళా శంకరుడిని దర్శించుకుంటామంటున్నారు భక్తులు. అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వేల మంది జమ్ము బేస్‌ క్యాంప్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో వాళ్లు ముందుకెళ్లడానికి అధికారులు అనుమతించలేదు. ఇప్పటివరకు 2 లక్షల 80 వేల మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు.అమర్‌నాథ్‌ యాత్రలో కొంతమంది భక్తులకు శ్వాసపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఐటీబీపీ సిబ్బంది వెంటనే వాళ్లకు ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ప్రాణాలను కాపాడుతున్నారు. ఎత్తైన ప్రాంతం కావడంతో వాళ్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో ఐటీబీపీ సిబ్బంది ఆదుకున్నారు. శేష్‌నాగ్‌ దగ్గర ఇప్పటివరకు 2000 మంది యాత్రికులకు ఆక్సిజన్‌ అందించినట్టు ఐటీబీపీ సిబ్బంది తెలిపారు. వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రకు పలుమార్లు బ్రేక్‌ పడుతోంది. అయినప్పటికి ముందుకే వెళ్తున్నారు భక్తులు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....