మంత్రి సబిత కార్యాలయం ముట్టడి BJP నేతల అరెస్టు

రంగారెడ్డి ఆగష్టు 25 (ఇయ్యాల తెలంగాణ ):విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి వచ్చిన బిజెపి నాయకులు, పోలీసుల తోపులాట  జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూల వెంటనే డిమాండ్‌ చేస్తూ శుక్రవారం  మహేశ్వరం నియోజకవర్గం జిల్లాల గుడా లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంపు కార్యాలయం ముట్టడికి  బిజెపి నాయకులు వచ్చారు. క్యాంపు కార్యాలయాన్ని  ముట్టడి చేసిన బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ నేపధ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో విూర్పేట్‌ సీఐ కిరణ్‌ కుమార్‌ కింద పడిపోయారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....