మంథని BUS డిపో గేటు వద్ద RTC ఉద్యోగుల ధర్నా

మంథని సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా   మంథని డిపో గేట్‌ వద్ద శుక్రవారం పలు డిమాండ్‌ లతో కూడిన బ్యాడ్జిలు ధరించి ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిపో కార్యదర్శి రాపెల్లి రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం లో విలీనానికి ముందే 2017, 2021 పేస్కేల్స్‌ అమలు చేయాలని, అదేవిధంగా 2013 పిఆర్సికి సంబంధించి బాండ్‌ డబ్బులు ఇప్పించాలని  ఆయన కోరారు. అదేవిధంగా సిసిఎస్‌ డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని, ఎస్‌అర్బిఎస్‌,ఎస్బిటి మరియు పిఎఫ్‌ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్టీసీ జేఏసీ నాయకులు పల్లెర్ల ఆంజనేయులు, రాజయ్య, ప్రవీణ్‌ లు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....