👉 మచ్చలేని నిస్వార్ధ నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్
👉 సమానత్వం కోసం చివరి వరకు పోరాడిన యోధుడు
👉 `నేడు ఆయన జయంతి .
బాబూ జగ్జీవన్ రామ్ ది ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం.. మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రి? ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడు,,. దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు? వివక్ష వ్యతిరేక పోరాటంలో అంబేద్కర్ కు సరిసమానుడు? ఆయనే బాబూ జగ్జీవన్ రామ్.
బాబూజీగా అందరూ పిలుచుకునే జగ్జీవన్ రామ్.. 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని చాండ్వాలో జన్మించారు. స్కూలు స్థాయిలోనే.. దళితుగా వివక్షను ఎదుర్కొన్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని దళితుల హక్కుల కోసమే అంకితం చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో, సామాజిక ఉద్యమాల్లో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పోరాడారు. పార్లమెంటరీ సెక్రటరీ స్థాయి నుంచి? దేశ ఉప ప్రధాని వరకు అనేక పదవులు నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. అణగారిన కులాలకు ఓటు హక్కు కోసం, కనీస వేతన చట్టం అమలు కోసం ఆయన కృషి చేశారు. విద్యార్థి దశనుంచే గాంధీజీ అహింసా మార్గాన్ని ఫాలో అయ్యారు జగ్జీవన్ రామ్. 1930లో.. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. 27 ఏళ్ల వయసులోనే 1935 లో.. బీహార్ శాసనమండలి సభ్యుడిగా పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించారు. స్వాతంత్య్రానికి ముందు ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలో.. యంగెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు. తర్వాత తొలి కేబినెట్ లో లేబర్ మినిస్టర్ గా పనిచేశారు. 1947లొ జెనీవాలో? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 1971లో భారత్`పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలొ హరిత విప్లవం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ కు, ఇందిరాగాంధీకి విధేయుడిగా ఉన్నారు జగ్జీవన్ రామ్. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని సపోర్ట్ చేశారు. 1977లొ కాంగ్రెస్ ను విడిచిపెట్టి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు.