మట్కా’ వైజాగ్‌లో జరుగుతున్న New షెడ్యూల్‌ !

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న తన పాన్‌ ఇండియా మూవీ మట్కా కోసం తన బెస్ట్‌ను అందిస్తున్నారు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న మట్కా వరుణ్‌ తేజ్‌కి మోస్ట్‌ ఎక్స్‌ పెన్సీవ్‌ మూవీ.  మట్కా ఖీఈఅలో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వింటేజ్‌ వైజాగ్‌లోని ఎసెన్స్‌ ని ప్రతిబింబించేలా వింటేజ్‌ మ్యాసీవ్‌ సెట్‌లలో షూటింగ్‌ జరిగింది. చాలా  కీలకమైన సన్నివేశాలు, హై`ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్స్‌, రెట్రో థీమ్‌ సాంగ్స్‌ షూటింగ్‌ జరిగింది.  

మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌ నోరా ఫతేహీను రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్‌ పబ్‌ సెట్‌లో ఎలిగెంట్‌ పోజులో ప్రజెంట్‌ చేస్తోంది. నోరా అద్భుతమైన డ్యాన్సర్‌, మట్కాలోని రెట్రో సాంగ్స్‌ ఆమెలోని అల్టిమేట్‌ డ్యాన్స్‌ ని చూపుతాయి. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌ అదిరిపోయే సెట్‌ లో నెంబర్‌ అఫ్‌ డ్యాన్సర్‌ తో చాలా గ్రాండ్‌ గా షూట్‌ చేశారు.ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోందని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథలో వరుణ్‌ తేజ్‌ డిఫరెంట్‌ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ ని పోషిస్తున్నారు.ఈ చిత్రంలో విూనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్నారు. టాప్‌ క్లాస్‌ నిర్మాణ విలువలు, వింటేజ్‌ వైజాగ్‌ రిక్రియేషన్‌ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ‘మట్కా’ ఒక మైల్‌ స్టోన్‌ మూవీ కాబోతోంది.

నటీనటులు: వరుణ్‌ తేజ్‌, నోరా ఫతేహి, విూనాక్షి చౌదరి, నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్‌, కన్నడ కిషోర్‌, రవీంద్ర విజయ్‌, పి రవి శంకర్‌, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....