మట్టి Ganesh ప్రతిమలను పంపిణీ చేసిన కరుణామయ విద్యార్థులు

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వద్దు మట్టితో తయారుచేసిన విగ్రహాలు ముద్దు

కౌతాళం,సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : కరుణామయ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ లోని విద్యార్థులు మట్టి గణేష్‌ ప్రతిమలను తయారుచేయడం జరిగిందని కరస్పాండెంట్‌ దండే వెంకట నరేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ దండే వెంకట్‌ నరేష్‌ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో శ్రద్ధతో మట్టి గణనాధుని ప్రతిమలను తయారు చేసి తీసుకురావడం శుభపరిణామమని, మట్టితో తయారుచేసిన గణనాధుని ప్రతిమలను ప్రతిష్టించడం వలన పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. పాఠశాల వ్యవస్థాపకులు దండే దస్తగిరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులు స్వయంగా మట్టితో తయారుచేసిన గణేష్‌ ప్రతిమలు తెస్తున్నారని, మట్టితో తయారుచేసిన గణేష్‌ విగ్రహాలను ప్రతిష్టించాలని విద్యార్థులు సందేశం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు,  తల్లిదండ్రులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....