మధ్యంతరం బెయిల్‌ రావడం మంచిదే AP BJP చీఫ్‌ పురందేశ్వరి

 
విజయవాడ అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ ):టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్‌ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు. నోటీసులివ్వకుండా, విచారణ జరపకుండా అరెస్ట్‌ చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పు పట్టామని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్‌ చేసిన విధానం కూడా కరెక్ట్‌ కాదన్నారు. మధ్యంతరం బెయిల్‌ రావడం మంచిదే అని పురందేశ్వరి పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....