మరో సంచలనానికి తెరలేపిన రిలయన్స్‌ జియో రూ. 999 లకే జియోభారత్‌ 4జి ఫోన్‌ను

 

    

జూలై 7 నుంచి మార్కెట్లోకి 1 మిలియన్‌ జియో భారత్‌ 4జీ ఫోన్లు

ముంబాయ్‌ జూలై 4,(ఇయ్యాల తెలంగాణ ):రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరలేపింది. జియోభారత్‌ 4జి ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 2జీ నుంచి 4జీకి ప్రమోట్‌ చేసే క్రమంలో ‘జియో భారత్‌’ పేరుతో ఈ ఫోన్‌ లాంచ్‌ చేసింది. కార్బన్‌ కంపెనీ భాగస్వామ్యంలో అందుబాటులో తీసుకొచ్చింది. దీని ధర రూ. 999గా నిర్ణయించింది. జూలై 7 నుంచి 1 మిలియన్‌ జియో భారత్‌ 4జీ ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 14 జీబీ డేటా (రోజుకు 0.5జీబీ) వస్తుంది. అదే సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది.గా.. దేశంలో ఇప్పటివరకు 25 కోట్లమంది జియో మొబైల్స్‌ వాడుతున్నారని రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాష్‌ అంబానీ తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగానే జియో భారత్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మొబైల్‌కు నెలకు రూ.123 రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....